23, జూన్ 2013, ఆదివారం

అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాద్రి సోముడు ఎందువలన దేవుడు?
రాముడు త్యాగ ధనుడు . తండ్రి మాట కోసం రాజ్యాన్నే గడ్డి పరక లాగా త్యజించాడు . వినయం,పరాక్రమం,ధర్మం మొదలైన సద్గుణాలన్నీ రాముడిలో వున్నాయి . రాముని జీవితం ఆదర్శాలకు, విలువలకు కట్టుబడి సాగింది . మానవుడై పుట్టి మాధవుడైనాడు శ్రీరామచంద్రుడు . ఎన్నో మంత్రాలు ,బీజాక్షరాలు ఉన్నప్పటికీ, ఒక్క రామనామానికి మాత్రమే తారకమంత్రం అని పేరు వచ్చింది . అంటే ఈ సంసార సాగరం నుండి తరింప చేసేది అని అర్ధం . శ్రీ రామ చంద్రుడు ఎవరిని తన శత్రువులుగా భావించలేదు. తనను అడవులకు పంపిన కైకమ్మను గాని తన భార్యను అపహరించిన రావణుడినిగాని ద్వేషం తో ఎన్నడూ  చూడలేదు.  వాలిని చంపినా,రావణుడిని వధించినా,విభీషణుడికి శరణొసగినా , అన్నీ తన  కర్తవ్యంగా భావించి,ధర్మబద్ధంగా ప్రవర్తించాడు. ఒక్క సారి శ్రీరామ రామ రామ అంటే విష్ణు సహస్ర నామం జపించినంత పుణ్యం వస్తుందని సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతి దేవితో పలికి వున్నాడు.

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

   

1 కామెంట్‌: